బిఆర్ఎస్ కు వెల్లువెత్తుతున్న మద్దతు

బిఆర్ఎస్ కు వెల్లువెత్తుతున్న మద్దతు
- అభ్యర్థి పాలకుర్తి గోపి విస్తృత ప్రచారం
పరకాల, ఆంధ్రప్రభ : పట్టణంలోని 20 వ వార్డులో బిఆర్ఎస్ పార్టీకి మద్దతు వెలువెత్తుతున్నది. బిఆర్ఎస్ అభ్యర్థి పాలకుర్తి గోపి పట్టణంలోని ప్రజలకు సుపరిచితుడు, ఈ క్రమంలో 20వ వార్డులోని ఓటర్ల ఇంటికి ప్రచారానికి వెళ్లిన క్రమంలో గోపిని సాదరంగా ఆహ్వానిస్తూ ఓటర్లు మద్దతు తెలుపుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. వార్డులోని సమస్యలను తెలుసుకుంటూ వాటి శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తానని గోపి ఓటర్లకు హామీ ఇచ్చారు. 20 వార్డులో ఓటర్ల ఆదరణతో ఘన విజయం సాధిస్తానని గోపి ఆశాభావం వ్యక్తం చేశారు. పూర్వ కౌన్సిలర్ అనుభవంతో 20వ వార్డును ప్రగతి పథంలో నడిపిస్తానని పాలకుర్తి గోపి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
