3 వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి
సందిల సురేష్ గౌడ్ ప్రచారం
ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని మూడవ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి సందిల సురేష్ గౌడ్ శుక్రవారం ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలుసుకొని తనని ఆశీర్వదించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తనను గెలిపిస్తే వార్డు సమగ్ర అభివృద్ధికి అంకితభావంతో కృషి చేస్తానని సురేష్ గౌడ్ హామీ ఇచ్చారు. నిరంతరం పనిచేయడమే లక్ష్యంగా ప్రతిక్షణం అందుబాటులో ఉంటానని ఆయన తెలిపారు. కార్యక్రమంలో రాఘవాపురం మాజీ ఎంపీటీసీ ఆరె ప్రశాంత్ గౌడ్, కొలనుపాక గ్రామ కాంగ్రెస్ బాధ్యులు గాదె సోమిరెడ్డి, సీనియర్ నాయకులు దూడల రమేష్, నాయకులు లోకేష్, పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు, యువజన ప్రతినిధులు, మహిళలు పాల్గొన్నారు.
