మీ బిడ్డగా ఆశీర్వదించండి..అభివృద్ధి చేస్తా..
15వ వార్డు బీజేపీ అభ్యర్థి పెద్దారి విందు
కల్వకుర్తి: ఫిబ్రవరి 6 (ఆంధ్రప్రభ): మున్సిపాలిటీ ఎన్నికల్లో మీ బిడ్డగా తనను ఓటర్లు ఆశీర్వదించి కౌన్సిలర్ గా గెలిపిస్తే వార్డును అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని 15వ వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి పెద్దారి విందు ఓటర్లను కోరారు. ఎన్నికల్లో భాగంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, ప్రజలతో కలిసి వార్డులో ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తూన్నారు. ప్రతిరోజు ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను కలుస్తూ మీ అమూల్యమైన ఓటు కమలం పువ్వు గుర్తుపై వేసి తనను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. వార్డు ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇస్తూ తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. ఈనెల 11న జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని పెద్దారి విందు ఓటర్లను కోరారు.
