గెలుపు దిశగా 15 వార్డు కాంగ్రెస్ అభ్యర్థి చింతల వసంత
గెలుపు దిశగా 15 వార్డు కాంగ్రెస్ అభ్యర్థి చింతల వసంత
- 15వ వార్డు అభివృద్ధికి 10 సూత్రాల ప్రణాళికతో ముందడుగు!
బెల్లంపల్లి, ఫిబ్రవరి 6 (ఆంధ్రప్రభ): మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బెల్లంపల్లి 15వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి చింతల వసంత ప్రచారం ప్రభంజనంలా సాగుతోంది. శుక్రవారం వార్డులోని పలు బస్తీల్లో ఆమె నిర్వహించిన పాదయాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. అడుగడుగునా మహిళలు హారతులు పట్టి, భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని భరోసా ఇవ్వడంతో ఆమె ప్రచారం గెలుపు దిశగా దూసుకుపోతోంది. ఈ సందర్భంగా వార్డు సమగ్ర అభివృద్ధి కోసం పది సూత్రాలతో కూడిన తన ప్రత్యేక ప్రణాళికను ఆమె ఓటర్ల ముందుకు తీసుకువచ్చారు. వార్డు రూపురేఖలు మార్చే లక్ష్యంతో చింతల వసంత పలు కీలక హామీలు ఇచ్చారు.
వార్డులో నూతన డ్రైనేజీలు, సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టడంతో పాటు, వీధుల్లో చెత్తాచెదారం లేకుండా శాశ్వత పారిశుధ్య పరిష్కారం చూపుతామని తెలిపారు. నూతన కరెంట్ స్తంభాలు, వీధి దీపాల ఏర్పాటు, ప్రతి ఇంటికీ పైప్‌లైన్ ద్వారా స్వచ్ఛమైన తాగునీటి సరఫరాకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. ప్రజలందరికీ ఉపయోగపడేలా నూతన కమ్యూనిటీ హాల్ నిర్మాణం, వీధి కుక్కల బెడద నివారణ, మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఆమె ప్రకటించారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ సంపూర్ణ సహకారంతో నిధులు మంజూరు చేయించి వార్డులోని ప్రతి సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ఆరు గ్యారెంటీ పథకాలు ప్రతి ఇంటికీ మేలు చేస్తున్నాయని, అవే తనను భారీ మెజార్టీతో గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కన్నూరి వెంకటేశ్వర్లు, దేవసాని ఆనంద్, దెబ్బేటి రమేశ్, కాశిపాక జీవరత్నం, కన్నూరి రాజలింగు, చింతల లోకేశ్వర్, ఎండి. గౌస్, బొల్లి వంశీ, రామ్ లక్ష్మణ్ లతో పాటు వార్డు కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని చింతల వసంతకు జై కొట్టారు.
