గెలిపించండి అభివృద్ధికి బాటలు వేద్దాం

గెలిపించండి అభివృద్ధికి బాటలు వేద్దాం

మక్తల్ఆంధ్రప్రభ : మక్తల్ మున్సిపాలిటీలో 11వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నవీద బేగం ను ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించండి అభివృద్ధికి బాటలు వేద్దామని కాంగ్రెస్ నాయకులు మంజూర్, అబ్దుల్ రెహమాన్ అన్నారు .ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం 11వ వార్డు పరిధిలోని ఇంటింటా ప్రచారం ముమ్మరం చేశారు .

ఈ సందర్భంగా వారు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను కలుసుకొని మద్దతు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి సహకారంతో 11వ వార్డును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని వివరించారు . అభివృద్ధి కోసం ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దడం కోసం మీ అందరి సహకారం కావాలని అభ్యర్థించారు. స్థానికంగా నెలకొన్న సమస్యలన్నిటిని పరిష్కరించడమే తమ లక్ష్యమని అన్నారు .

ప్రజా సేవ కోసం ఎన్నికల్లో పోటీ చేస్తున్న నవీద బేగం ను ఆశీర్వదించి అండగా నిలిచి 11న జరగనున్న ఎన్నికల్లో భారీ మెజారిటీతో కౌన్సిలర్గా గెలిపించవలసిందిగా వారు విజ్ఞప్తి చేశారు .ఈ కార్యక్రమంలో రంజాన్, రహమాన్ ,అప్రోజ., షాబుద్దీన్, నయీమ్, బాలరాజు, సద్దాం ,యాసిన్, రహీం, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply