అందుబాటులో ఉండి అభివృద్ధి చేస్తా

అందుబాటులో ఉండి అభివృద్ధి చేస్తా
- ఆదరించి గెలిపించండి
- 14 వ వార్డ్ స్వతంత్ర అభ్యర్థి చింత అశోక్ కుమార్
లక్షేట్టిపేట, ఆంధ్రప్రభ : 14 వ వార్డ్ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి వార్డ్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని స్వతంత్ర అభ్యర్థి చింత అశోక్ కుమార్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఉదయం వార్డ్ లో ప్రజలను కలిసి ఓటు అభ్యర్థించారు. కాలనీలో సమస్యలపై తనకు సంపూర్ణ అవగాహన ఉందని ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవ చేస్తానని హామీ ఇచ్చారు.స్వతంత్ర అభ్యర్థిగా ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో తనను గెలిపించాలని ఆయన కోరారు. గతంలో ఇదే వార్డ్ లో తన సతీమణి సువర్ణ ఆధ్వర్యంలో వార్డ్ లోని ప్రజలకు పారిశుద్ధ్యం, తాగునీరు, డ్రైనేజీ, వీధి దీపాలు,సీసీ రోడ్ల నిర్మాణం ద్వారా ఎల్లప్పుడూ సేవలందించినట్లు పేర్కొన్నారు. కరోనా సమయంలో కాలనీ వాసులకు అందుబాటులో ఉండి ఎలాంటి ఇబ్బందులు రాకుండా సేవలు అందించినట్లు గుర్తు చేశారు.
వార్డ్ లోని అన్ని ప్రధాన వీధుల్లో చింత అశోక్ కుమార్ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఓటర్ల నుంచి వస్తున్న అపూర్వ స్పందన చూస్తుంటే అశోక్ కుమార్ విజయం ఖాయమని నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా ఉంగరం గుర్తు అఖండ విజయం సాధిస్తుందని వార్డ్ ప్రజలు అనుకుంటున్నారు.గడప గడపకు వెళ్లి వార్డ్ అభివృద్ధికి తనను గెలిపించాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది 14 వ వార్డ్ అభివృద్ధికి సంబంధించిన విజయమౌతుందని, వ్యక్తులు ఇక్కడ ముఖ్యం కాదని సేవకులే ముఖ్యమని ప్రజలు గుర్తించి ఉంగరం గుర్తుకు అమూల్యమైన ఓటు వేయాలని ఓటర్లను ఆయన కోరారు.ఈ ప్రచారంలో ఉత్తూరి రవీందర్, నల్ల కుమార్, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
