Govt | మోసపోకండి… గోసపడకండి…

Govt | మోసపోకండి… గోసపడకండి…

  • కాంగ్రెస్ బిజెపిలకు బుద్ధి చెప్పండి
  • రాజన్న ఆలయానికి ఒక్క రూపాయయినా ఇచ్చారా
  • బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

Govt | వేములవాడ, ఆంధ్రప్రభ : మున్సిపల్ ఎన్నికల్లో మరోసారి ప్రజలు మోసపోయి గోసపడవద్దని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… 2023లో కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలు నమ్మి ప్రజలు ఓటు వేసి రెండు సంవత్సరాలుగా గోసపడుతున్నారన్నారు. ఇప్పటికే మూడుసార్లు రైతుబంధు ఎగ్గొట్టారని, 6 గ్యారంటీలు అమలు చేయడం లేదన్నారు. కల్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఎందుకు ఇవ్వడం లేదని, మహిళలకు 2500 ప్రతినెల ఎందుకు ఇవ్వడంలేదని, విద్యార్థినిలకు స్కూటీలు ఇచ్చారా అని ప్రశ్నించారు.

బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో 70 లక్షల మంది రైతులకు రైతుబంధు ఇచ్చామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు అని ప్రజలను మోసగిస్తుందని మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తూ మగవారికి డబుల్ చార్జీలు వసూలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్, బిజెపి వాళ్లు ఓట్లకు వేలాది రూపాయలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారని బరాబర్ డబ్బులు తీసుకోండని, ఓటు మాత్రం కారు గుర్తుకు వేయాలన్నారు.

రాజన్న ఆలయానికి బండి ఒక్క రూపాయి అయినా తెచ్చాడా..?

వేములవాడ రాజన్న ఆలయానికి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ ఒక్క రూపాయి అయినా అభివృద్ధి కోసం కేటాయించార అని కేటీఆర్ ప్రశ్నించారు. రెండుసార్లు ఎంపీగా గెలిపిస్తే ఒక్క రూపాయి కూడా ఆలయ అభివృద్ధికి కేటాయించలేదన్నారు. ఎన్నికలు రాగానే దేవుళ్ళ పేరుతో రాజకీయం చేయడం బండికి అలవాటైపోయిందన్నారు. ఏం చేశారని బిజెపికి ఓటు వేయాలో ప్రచారంలో బీజేపీ నాయకులను నిలదీయాలన్నారు.

Leave a Reply