మక్తల్ అభివృద్ధి కోసం మరోసారి బిజెపికి అవకాశం ఇవ్వండి

మక్తల్ అభివృద్ధి కోసం మరోసారి బిజెపికి అవకాశం ఇవ్వండి

  • ఎన్నికల ప్రచారంలో బిజెపి రాష్ట్ర నాయకులు కొండయ్య

మక్తల్ , ఆంధ్రప్రభ ; మక్తల్ అభివృద్ధి కోసం మరోసారి మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులను గెలిపించి మరో అవకాశం ఇవ్వాలని మక్తల్ ప్రజలకు మాజీ ఎంపీపీ బీజేపీ రాష్ట్ర నాయకులు కొండయ్య విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం పాలమూరు ఎంపీ డీకే .అరుణమ్మ సహకారంతో భారీ ఎత్తున మక్తల్ మున్సిపాలిటీకీ నిధులు తీసుకువచ్చే బాధ్యత మాదని మక్తల్ ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని ఎన్నికల్లో మరోసారి బిజెపి అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి బిజెపికి అండగా నిలవాలని కోరారు.

అందరివాడు ఈ ప్రాంత వ్యక్తి యువ నాయకుడు బి .రాజశేఖర్ రెడ్డిని 1వ వార్డు కౌన్సిలర్ గా కమలం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. శుక్రవారం రాజశేఖర్ రెడ్డి కి మద్దతుగా 1వ వార్డు వినాయక నగర్ లో ముమ్మరంగా ఇంటింట ప్రచారం చేపట్టారు .ఓటర్లను అభ్యర్థి పార్టీ నాయకులతో కలిసి ఆయన కలుసుకొని బిజెపి గెలుపుతో ఈ పట్టణం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో వివరించారు. కేంద్రం నుండి వచ్చే నిధులు ఎంతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు ఎంతో వివరించి కేంద్రమే మున్సిపాలిటీల అభివృద్ధికి నిధులు ఇస్తుంది కాబట్టి మక్తల్ లో బిజెపిని గెలిపించాలని ఆయన కోరారు.

ఈ సందర్భంగా కొండయ్య మాట్లాడుతూ 1995 నుండి మక్తల్ ప్రజలు బిజెపికి అండగా నిలిచారని గుర్తు చేశారు.19 95 ఎంపిటిసి ఎన్నికల్లో నాలుగు ఎంపీటీసీ స్థానాల్లో మూడు స్థానాల్లో బిజెపి అభ్యర్థులను గెలిపించిన చరిత్ర మక్తల్ పట్టణ ప్రజలదని అన్నారు.నాటి నుండి ప్రతి ఎన్నికల్లోను బిజెపికి అండగా నిలుస్తున్నారని గుర్తు చేశారు. గత పార్లమెంటు ఎన్నికల్లోను మక్తల్ పట్టణంలో డీకే .అరుణమ్మకు మెజారిటీ అందించి మద్దతు పలికారని గుర్తు చేశారు. తొలి మున్సిపల్ ఎన్నికల్లో బిజెపికి అధికారం ఇచ్చారని గత రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ఏడుపులు తప్ప పదవులు కాపుకోడుకో కాపాడుకోవడం తప్ప చేసిన అభివృద్ధి శూన్యమని అన్నారు.

అందుకే ఈ ఎన్నికల్లో మరొకసారి బిజెపి అభ్యర్థులను గెలిపించి అధికారాన్ని అప్పగించాలని పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అధికారం ఉన్న లేకున్నా ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నిరంతర పనిచేస్తున్న బీజేపీ పట్ల పట్టణ ప్రజలు సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని ప్రచారంలో ఎక్కడికి వెళ్లినా అండగా ఉంటామని మాటిస్తున్నారని ఈనెల 11న జరగనున్న ఎన్నికల్లో 1వ వార్డు బిజెపి అభ్యర్థి రాజశేఖర్ రెడ్డిని అదేవిధంగా మిగతా వార్డుల్లోనూ బిజెపి అభ్యర్థులను కమలం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా కొండయ్య విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ అఖిల రాజశేఖర్ రెడ్డి, బిజెపి నాయకులు జి.బలరాం రెడ్డి, దేవరింటి నర్సింహారెడ్డి, కర్ని స్వామి,జయానందన్ రెడ్డి ,ప్రసన్న బలరాం రెడ్డి, జీవన్ రావు, మిఠాయి సురేష్, బాల్రెడ్డి,అమరచింత శివరామ్ ,విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply