అభివృద్ధి కాంక్షించి…గెలిపించండి

అభివృద్ధి కాంక్షించి…గెలిపించండి

  • మున్సిపల్ పోరులో 28 వ డివిజన్ అభ్యర్థి నూకల రామ్మోహన్ రెడ్డి

ఖమ్మం రూరల్, ఆంధ్రప్రభ : ఏదులాపురం మున్సిపాలిటీ లో 28 వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నూకల రామ్మోహన్ రెడ్డి బరిలో ఉండి ప్రచారం లో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన వివిధ పథకాలు అమలు చేస్తున్న విధానాన్ని వివరిస్తూ 28వ అభివృద్ధి కాంక్షించి ఓటర్లు తమ హస్తం గుర్తు కు ఓటు వేసి అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. అవినీతి కి తావులేకుండా నిత్యం ప్రజల మద్య ఉంటూ ..ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కృషి చేస్తానని హామీ ఇస్తున్నారు.వార్డు పరిధిలో సీసీ రోడ్లు,డ్రైనేజీలు, వీధి లైట్లు,మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని ప్రచారం నిర్వహిస్తున్నారు.నిత్యం స్థానికంగా, ప్రజలకు అందుబాటులో ఉండే తనకు ఈ సారి అవకాశం ఇచ్చి ..వార్డ్ అభివృద్ధి లో భాగస్వామ్యం చేయాలని ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేస్తున్నారు.