ఓడలు బండ్లు…బండ్లు ఓడలు..

ఓడలు బండ్లు…బండ్లు ఓడలు..

  • పార్టీల తారు.. మారు
  • కాంగ్రెస్, బీఆర్ ఎస్, స్వతంత్ర అభ్యర్థులుగా పోరులో…

మోత్కూర్, ఆంధ్రప్రభ : ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు.. అంటే ఇదేనేమో.. మోత్కూర్ మున్సిపల్ ఎన్నికల్లో ఆయా పార్టీల అభ్యర్థులుగా పార్టీ బి ఫారం పొందిన అభ్యర్థులు.. ప్రస్తుత పోరులో తారుమారయ్యారు. నాడు ఓ పార్టీ నుండి పోటీ చేసిన కౌన్సిలర్ అభ్యర్థులు.. నేడు మరో పార్టీ లేదా స్వతంత్ర అభ్యర్థులుగా పోరులో నిలిచారు. 2 వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కూర్మిళ్ల ప్రమీల రాములు ప్రస్తుతం కాంగ్రెస్ తరపున, 5 వ వార్డులో మలిపెద్ది రజిత, మొగుళ్ళ అనురాధలు నాడు కాంగ్రెస్, బీఆర్ఎస్ తరపున పోటీ చేయగా.. ప్రస్తుతం ఇరువురు స్వతంత్ర అభ్యర్థులుగా 9 వ వార్డులో మన్నేభీమయ్య గతంలో కాంగ్రెస్ తరపున.. ప్రస్తుతం బీఆర్ ఎస్ తరపున పోటీలో ఉన్నారు. పార్టీలు మారి కొందరు.. రెబల్స్ అభ్యర్థులుగా మరికొందరు బరిలో ఉండి విస్తృత ప్రచారం చేస్తున్నారు.

Leave a Reply