నా తమ్ముడిని గెలిపించండి..
నా తమ్ముడిని గెలిపించండి..
- మీకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాను
వరంగల్ ఎంపీ కడియం కావ్య
స్టేషన్ ఘన్ పూర్ ఫిబ్రవరి 5 ఆంధ్రప్రభ : నా తమ్ముడు సంపత్ ను భారీ మెజారిటీతో గెలిపించండి..మీకు ఇచ్చిన ప్రతి హామీని నేను నెరవేరుస్తానని ఎంపీ కావ్య ప్రజలకు భరోసా ఇచ్చారు. గురువారం స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 6,7,8,9వ వార్డులో ఇంటింటా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఎంపీ కావ్య పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ రాజు తనకు తమ్ముడి లాంటివాడు అని పేర్కొన్నారు. ఆయన గెలుపు కోసం తాను పూర్తిగా అండగా నిలుస్తాను. ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేయించే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా సంపత్ రాజు ముందుకు సాగుతు న్నారని, ప్రజల ఆశీర్వాదంతో ఆయనను గెలిపించాలని ఎంపీ కావ్య కోరారు.
