Minister | పోలీసులు లేకుండా బయటకు రాగలవ..

Minister | పోలీసులు లేకుండా బయటకు రాగలవ..
- మంత్రి కొల్లు రవీంద్ర సూటి ప్రశ్న
Minister | మచిలీపట్నం – ఆంధ్రప్రభ ; నోరు విప్పితే శ్రీరంగనీతులు చెబుతున్న జగన్మోహన్ రెడ్డి పోలీసులు లేకుండా బయటకు రాగలరా అని రాష్ట్ర ఎక్సైజ్ గనులు భూగర్భవన్లో శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సూటిగా ప్రశ్నించారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలో గురువారం జరిగిన అన్న క్యాంటీన్ ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రి కొల్లు రవీంద్ర హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అంబటి రాంబాబు ఇంటికి పరామర్శవంకతో వెళ్లిన జగన్ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్రంలో రాక్షస సంస్కృతికి తెర లేపి న జగన్ రెడ్డికి ఎదుటివారికి నీతలు చెప్పే అర్హత లేదన్నారు.
ఆయన చెప్పేవి శ్రీరంగనీతులు చేసేది ఏదో అన్నట్టుగా రాష్ట్ర ప్రజలు భావిస్తున్న సంగతి ఆయనకు తప్ప అందరికీ తెలుసు అన్నారు. ఆడబిడ్డలను అవమానించడం వైసిపి నాయకులకు వెన్నతో పెట్టిన విద్యగా ఉందన్నారు. ఇలాంటి నాయకులకు ఈ భూమండలం మీద నడిచే అర్హత లేదన్నారు. వారిలో జగన్మోహన్ రెడ్డి ముందు వరుసలో ఉంటారన్నారు. సీఎం చంద్రబాబుపై ఇష్టారాజ్యంగా నోరు పారేసుకున్న అంబటి రాంబాబుపై తెలుగుదేశం పార్టీకి చెందిన వారే కాకుండా ప్రజలందరూ ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. ఆ ఆగ్రహం కట్టలు తెలుసుకోవడంతో అభిమానులు అంబటి ఇంటి వరకు వెళ్లారన్నారు. పోలీసులు లేకపోతే అంబటి రాంబాబు ఏమైపోయేవారో తెలుసుకోవాలన్నారు. అంబటి రాంబాబే కాదు పోలీసులు లేకుండా జగన్ రెడ్డి బయటకు రాగలరా అని మంత్రి రవీంద్ర ఈ సందర్భంగా ప్రశ్నించారు.
