30k Above | బంగారం ధరలు ఒక్కసారిగా ఎందుకు పతనం అయ్యాయి? ఇప్పుడు కొనవచ్చా?

30k Above | బంగారం ధరలు ఒక్కసారిగా ఎందుకు పతనం అయ్యాయి? ఇప్పుడు కొనవచ్చా?

30k Above | బంగారం ధరలు భారీగా తగ్గడానికి ప్రధాన కారణాలు
డాలర్ బలపడటం – బంగారంపై ప్రభావం
ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణతో అమ్మకాలు
ట్రేడింగ్ మార్జిన్ పెంపు వల్ల ధరల పతనం
రాబోయే 3–4 రోజుల్లో బంగారం ధరల పరిస్థితి
ఇప్పుడు బంగారం కొనాలనుకునే వారికి నిపుణుల సూచనలు

30k Above | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : గత రెండు రోజులుగా బంగారం ధరలు ఊహించని రీతిలో భారీగా పతనమవ్వడం పసిడి ప్రియులకు పెద్ద ఊరటనిస్తోంది. కొద్ది రోజుల క్రితం వరకు ఆకాశమే హద్దుగా పెరిగిన ధరలు, ఇప్పుడు ఒక్కసారిగా ఎందుకు దిగివచ్చాయో.. అలాగే ఇప్పుడు కొనడం సరైన సమయమేనా అనేది అందరిలోనూ తలెత్తుతోన్న పెద్ద ప్రశ్న.

30k Above | బంగారం ధరలు అమాంతం తగ్గడానికి కారణాలు:


​నిన్న మొన్నటి వరకు తులం (10 గ్రాములు) బంగారం ధర రికార్డు స్థాయిలకు చేరుకోగా, ప్రస్తుతం భారీగా తగ్గుతూ వస్తుంది. దీనికి ప్రధానంగా అంతర్జాతీయ పరిణామాలు కారణం. ​అమెరికాలో కొత్త ‘ఫెడ్ ఛైర్మన్’గా కెవిన్ వార్ష్ పేరును డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించడంతో డాలర్ విలువ ఒక్కసారిగా బలపడింది. దీనివల్ల ఇన్వెస్టర్లు బంగారం నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకుని డాలర్ వైపు మొగ్గు చూపుతున్నారు. ​అలాగే బంగారం ధరలు భారీగా పెరిగినప్పుడు, ఇన్వెస్టర్లు తమ వద్ద ఉన్న బంగారాన్ని అమ్మి లాభాలను సొమ్ము చేసుకుంటారు.
దీనివల్ల మార్కెట్లో అమ్మకాలు పెరిగి ధరలు తగ్గాయి. ​అంతర్జాతీయ కమోడిటీ ఎక్స్ఛేంజీలు బంగారం ట్రేడింగ్‌పై ‘మార్జిన్’ పెంచడంతో ట్రేడర్లు తమ పొజిషన్లను తగ్గించుకున్నారు. ఇది కూడా ధరల పతనానికి దారితీసింది.

30k Above | ఇప్పుడు కొనవచ్చా? రాబోయే 3,4 రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుంది?

​ప్రస్తుత మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం..రాబోయే 3-4 రోజుల్లో ధరలు మరింత స్థిరంగా ఉండే అవకాశం ఉంది. ఒకేసారి భారీగా పెరగడం లేదా మరీ దారుణంగా పడిపోవడం ఉండకపోవచ్చు. అయితే, మార్కెట్ ఇంకా ఒడిదుడుకుల్లోనే ఉంది. ​దీర్ఘకాలికంగా చూస్తే బంగారం ధరలు మళ్లీ పెరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి ఇంకా పూర్తిగా తొలగిపోలేదు.

30k Above | కొనుగోలుదారులకు నిపుణుల సూచన:

మీరు పెళ్లిళ్ల కోసం లేదా పెట్టుబడి కోసం బంగారం కొనాలనుకుంటే, విడతల వారీగా కొనడం ఉత్తమం. అంటే ఒకేసారి కాకుండా, కొంచెం కొంచెంగా కొంటే ధరలు తగ్గినప్పుడు మీకు సగటున తక్కువ ధరకే బంగారం లభిస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న ధరల పతనం ఒక “టెక్నికల్ కరెక్షన్” మాత్రమే. బంగారం ప్రాథమిక విలువ ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది కాబట్టి, భారీగా తగ్గినప్పుడే కొనుగోలు చేయడం తెలివైన పని.

click here to read more

click here tor read Gold Rate | ఒక్క‌రోజులోనే..

Leave a Reply