Dharna | అద్వాన్నపు రహదారిని మరమ్మతు చేయాలని ధర్నా..

బచ్చన్నపేట, ఆంధ్రప్రభ : బచ్చన్నపేట మండల కేంద్రంలోని అద్వాన్నపు రహదారికి వెంటనే మరమ్మతు చేయాలని.. నిర్లక్ష్యం వల్ల వాహనాల రాకపోకలతో నిత్యం దుమ్ము ధూళితో శ్వాసకోస వ్యాధి బారిన బడి ఎంతోమంది అనారోగ్యం పాలయ్యారన్నారు. జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే, సంబంధిత అధికారులు, జాతీయ రహదారి కాంట్రాక్టర్ రావాలని, ఎప్పుడు మరమ్మతు చేస్తారో తేల్చి చెప్పాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రంలోని చౌరస్తాలో పలు పార్టీల నాయకుల ఆధ్వర్యంలో గంటపాటు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా వల్ల భారీగా వాహనాలు నిలిచిపోయాయి. స్థానిక ఎస్సై ఎస్కే హమీద్ ప్రత్యేక చొరవ తీసుకొని సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్ తో మాట్లాడించడంతో ధర్నాను విరమించారు. ఈ ధర్నా కార్యక్రమంలో పలు పార్టీల నాయకులు రహదారి పక్కన గల ఇల్లు దుకాణాల యాజమాన్యులు గ్రామస్తులు పలువురు పాల్గొన్నారు…
