Utnoor | 108 లో గర్భిణీ మహిళా ప్రసవం

Utnoor | ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని గిరిజన గర్భిణీ మహిళా శనివారం 108లో పురుడు పోసుకుని మగ శిశువుకు జన్మనిచ్చినట్లు 108 ఈఎంటి రాజశేఖర్ పైలట్ పాపారావు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారంగా.. ఉట్నూర్ మండలంలోని చింత కర్ర గ్రామానికి చెందిన గర్భిణీ మహిళా పద్మాభాయ్ కి పురిటి నొప్పులు రావడంతో 108 వాహనానికి సమాచారం ఇవ్వగా వారు వచ్చి ఆ గర్భిణీ మహిళను ముందుగా ఉట్నూర్ ఆసుపత్రికి తరలించి చికిత్సలు చేయగా ఆమె పరిస్థితి సరిగా లేకపోవడంతో వైద్యాధికారులు ఆదిలాబాద్ కు తీసుకువెళ్లాలని రెఫర్ చేయడంతో 108 లో తరలిస్తుండగామార్గమధ్యంలో పుట్టినప్పుడు అధికమై కావడంతో ఈఎంటి పైలెట్లు కలిసి ఆ గర్భిణీ పురుడు పోసినట్లు తెలిపారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని ప్రసవించిన శిష్యును తల్లి ని ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు చేయించినట్లు వారు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో పురుడు పోసి తల్లి శిశు క్షేమంగా ఉండేలా చికిత్సలు అందించిన 108 ఈఎంటి పైలట్లకు వారి కుటుంబీకులు, బంధువులు కృతజ్ఞతలు తెలిపినట్లు వారు పేర్కొన్నారు.
