Minister | కుటుంబ సమేతంగా అమ్మవార్ల దర్శనం….
Minister | కుటుంబ సమేతంగా అమ్మవార్ల దర్శనం….
Minister | మేడారం, ఆంధ్రప్రభ : సమ్మక్క సారలమ్మ మహా జాతర సందర్భంగా వనదేవతలను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దంపతులు, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పీసీసీ చీఫ్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దంపతులు దర్శించుకున్నారు. అనంతరం పూజలు నిర్వహించి, ప్రసాదాలను అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. మంత్రి దనసరి అనసూయ (సీతక్క) రాష్ట్ర రెవిన్యూ, హోసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదివాసీ సాంప్రదాయ కళాకారుల నృత్యప్రదర్శన ద్వారా స్వాగం పలికారు.

ఈ రోజు శ్రీ సమ్మక్క, సారలమ్మలకు నిలువెత్తు బంగారంతో అమ్మవార్లకు మొక్కులు సమర్పించి అనంతరం సమ్మక్క సారలమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి అభివృద్ధి చెందాలని తల్లులను వేడుకున్నామని తెలిపారు. చరిత్రాత్మక కట్టడాలు దేశప్రజల దృష్టినీ ఆకర్షిస్తున్నాయన్నారు. గతం కంటే ఈ జాతరకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారనీ పేర్కొన్నారు. వనదేవతలు తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని విధాల సుఖ సంతోషాలతో ఉంచాలని వేడుకున్నారు.



click here to read more 80lakhs | మేడారం జాతరలో రికార్డు స్థాయి భక్తుల రాక..
