cricket | ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్
- టాప్-10లో ముగ్గురు భారత ఆటగాళ్లు
- ఏడో స్థానంలో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్
- నెంబర్‌వన్‌గా కొనసాగుతున్న అభిషేక్ శర్మ
- తిలక్ వర్మకు మూడో ర్యాంకు
cricket | వెబ్‌డెస్క్, ఆంధ్రప్రభ : ఐసీసీ ఇవాళ టీ20 ర్యాంకులను ప్రకటించింది. ఈ ర్యాంకుల్లో భారత ఆటగాళ్లు దుమ్మురేపారు. టాప్‌టెన్‌లో ముగ్గురు చోటు సంపాదించారు. ప్రస్తుత న్యూజిలాండ్ సిరీస్‌తో ఫామ్‌లోకొచ్చిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ర్యాంకింగ్స్‌లోనూ టాప్‌టెన్‌లోకి దూసుకొచ్చాడు. చాలా రోజుల తర్వాత ఫామ్ అందుకొని న్యూజిలాండ్‌పై వరుసగా రెండు ఫిఫ్టీలతో సత్తా చాటిన ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఐసీసీ టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో ముందుకొచ్చాడు. సూర్య ఏకంగా ఐదు స్థానాలు ఎగబాకి ఏడో ర్యాంక్‌లో నిలిచాడు.
ఇక, విధ్వంసక భారత ఆటగాడు అభిషేక్ శర్మ నెంబర్‌వన్ ర్యాంక్‌ను నిలబెట్టుకోగా, తిలక్ వర్మ మూడో స్థానంలో మార్పు లేదు. మిగతా బ్యాటర్లలో శివమ్ దూబే 58వ, ఇషాన్ కిషన్ 64వ, రింకూ సింగ్ 68వ ర్యాంకుల్లో ఉన్నారు. బౌలర్ల జాబితాలో బుమ్రా నాలుగు స్థానాలు మెరుగై 13వ, రవి బిష్ణోయ్ 13 స్థానాలు ఎగబాకి 19వ ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. వరుణ్ చక్రవర్తి టాప్ ర్యాంక్‌ను పదిలపరుచుకున్నాడు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో 18 స్థానాలు మెరుగుపరుచుకుని 59వ స్థానానికి చేరుకున్నాడు. ఆల్‌రౌండర్ల లిస్ట్‌లో హార్దిక్ మూడో స్థానంలో నిలిచాడు.
