Police | రోడ్డు భద్రత మహోత్సవాలు..
Police | రోడ్డు భద్రత మహోత్సవాలు..
Police, గుడివాడ, ఆంధ్రప్రభ : గుడివాడ పట్టణంలో బస్టాండ్ సెంటర్ వద్ద ఆటో డ్రైవర్లకు, వాహదారులకు ట్రాఫిక్ పై రోడ్ సేఫ్టీ పై అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు రోడ్డు సేఫ్టీ గురించి.. వాహనం నడిపేటప్పుడు పలు జాగ్రత్తలు సూచనలు చేశారు. మద్యం తాగి వాహనం నడపకూడదు.. ప్రతి ఒక్కరు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, ప్రతి ఒక్కరు సీట్ బెల్ట్ ధరించాలని గుడివాడ పట్టణ ప్రజలకు ఈ అవేర్నెస్ కార్యక్రమం ద్వారా తెలియజేశారు. 37వ రహదారి భద్రత మాసోత్సవాల సందర్బంగా గుడివాడ రోడ్డు రవాణా శాఖ ఎంవిఐ సంగీతరావు ఈ కార్యక్రమం నిర్వహించారు.
