BRS | ఆరూరి రమేష్‌కు స్వాగతం….

BRS | ఆరూరి రమేష్‌కు స్వాగతం….
BRS | రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : వర్ధన్నపేట మాజీ శాసనసభ్యుడు ఆరూరి రమేష్ బీజేపీకి రాజీనామా చేసి తిరిగి బీఆర్ఎస్ లో చేరుతున్న సందర్భంగా రఘునాథపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వారాల రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో మండల నాయకులు ఘన స్వాగతం పలికారు. తెలంగాణ భవన్ కు ర్యాలీగా వెళుతున్న సమయంలో వారి వెంట బీఆర్ఎస్ నాయకులు తరలివెళ్లారు. ఈకార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ శాగా నాగరాజు, జనగామ వ్యవసాయ మార్కెట్ మాజీ డైరెక్టర్ శివరాత్రి రాజు, భానాజీపేట సర్పంచ్ గైని శ్రీనివాస్, కోడూరు సర్పంచ్ కోడిశాల లలిత సోమయ్య, లక్ష్మీ తాండా సర్పంచ్ పయ్యావుల రవి, మండల నాయకులు రేస్ కుమార్ యాదవ్, మండల సీనియర్ నాయకులు రాజి రెడ్డి, మాదారం గ్రామ పార్టీ అ ధ్యక్షులు ఉమ్మాగోని ఉప్పలయ్య, ఎల్లారెడ్డి గూడెం గ్రామపార్టీ అధ్యక్షుడు కుమార్, మోహన్ రావు, ఫాతేశాపూర్ గ్రామ పార్టీ అధ్యక్షుడు యమంకి కృష్ణ, నరేందర్ రెడ్డి, అక్కనపల్లి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు..
