TG | ప్రయాణికులకు ఆశ్చర్యం..

TG | ప్రయాణికులకు ఆశ్చర్యం..
- NH-44 (నార్సింగి రోడ్) పై 4 ఒంటెలు
TG | కామారెడ్డి–నిజామాబాద్ రూట్, ఆంద్రప్రభ : నేషనల్ హైవే-44లో నార్సింగి రోడ్‌పై రాజస్థాన్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న నాలుగు ఒంటెలు శుక్రవారం మధ్యాహ్నం అగుపడ్డాయి. హైవే పై ఒంటెలు కనిపించడంతో వాహనదారులు క్షణకాలం ఆగిపోయి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.
ఈ అరుదైన దృశ్యాన్ని చూసిన ప్రయాణికులు ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పంచుకోవడంతో విషయం వైరల్‌గా మారింది.
