Yadadri | జేఏసీ జిల్లా అధ్యక్షునిగా గోపినాధ్

Yadadri | జేఏసీ జిల్లా అధ్యక్షునిగా గోపినాధ్

Yadadri | మోత్కూర్, ఆంధ్రప్రభ : వ్యవసాయ విస్తరణ అధికారుల జేఏసీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడిగా మోత్కూరు క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి తుంగ గోపీనాథ్ ఏకగ్రీవంగా ఎన్నిక య్యారు. జిల్లా కేంద్రంలో వ్యవసాయ విస్తరణ అధికారుల సమావేశం నిర్వహించి జిల్లా వ్యవ సాయ విస్తరణ అధికారుల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) నూతన కమిటీని ఎన్నుకున్నారు.

జనరల్ సెక్రటరీగా జెస్సీ, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా ఎం.శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్‌గా జె.నరేష్, కోశాధికారిగా పి.సాయి లను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకు న్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు గోపీనాథ్ మాట్లాడుతూ వ్యవసాయ విస్తరణ అధికారుల సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని, జిల్లా జేఏసీ సైతం కీలక పాత్ర పోషిస్తుందన్నారు.

అనంతరం నూతనంగా ఎన్నికైన సభ్యులను సన్మానించి అభినందించారు.ఈ సందర్భంగా మోత్కూర్ మండల ఏ ఈ ఓ లు ముప్పిడి అశోక్,సింహ ప్రసాద్ లు అభినందనలు తెలిపారు.

Leave a Reply