Chityala | 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

Chityala | చిట్యాల, ఆంధ్రప్రభ : మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ జెండాలు ఎగురవేసి, అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు వివిధ రాజకీయ పార్టీలు, పలు యువజన సంఘాల వద్ద జాతీయ జెండాలను ఆవిష్కరించారు. తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ ఇమామ్ బాబా, పోలీస్ స్టేషన్లో సీఐ దగ్గు మల్లేష్, చిట్యాల మార్కెట్ కార్యాలయంలో చైర్ పర్సన్ గుమ్మడి శ్రీదేవి, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో జయశ్రీ, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి, బుర్ర వెంకటేష్, అల్లం రవీందర్, ప్రెస్ క్లబ్లో అధ్యక్షుడు కట్కూరి మొగిలి, మండలంలోని గ్రామపంచాయతీలో పంచాయతీ కార్యదర్శులు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. పార్టీలకు అతీతంగా నాయకులు, కార్యకర్తలు యువజన సంఘాలు, డ్వాక్రా మహిళలు వేడుకల్లో భాగస్వామ్యం అయ్యారు.

Leave a Reply