Distribution | రూ. 3.05 కోట్ల చెక్కుల పంపిణీ..

Distribution | నర్సంపేట, ఆంధ్రప్రభ : పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి పథకం వరప్రదాయనిగా మారిందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. పట్టణంలోని సిటిజెన్ పంక్షన్ హాల్లో కళ్యాణ లక్ష్మి చెక్కులను ఈ రోజు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ… ప్రజా ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో, 6 మండలాలకు చెందిన 305 మంది లబ్ధిదారులకు రూ. 3 కోట్ల 5 లక్షల విలువైన కళ్యాణ లక్ష్మీ ,షాదీ ముబారక్ చెక్కులను అందించినట్లు తెలిపారు.
పేద ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందజేస్తుందని తెలిపారు.కల్యాణ లక్ష్మి పథకం ద్వారా అర్హులు ఎటువంటి దళారులకు నమ్మవద్దని తెలిపారు.పెళ్లి చేసిన ఇంటికి ఆర్ధిక సహాయం అందించాలని ప్రభుత్వ నిర్ణయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి, నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, వైస్ చైర్మన్ హరిబాబు, నెక్కొండమండల అధ్యక్షులు బక్కి అశోక్, నెక్కొండ సర్పంచ్ పెండ్యాల హరిప్రసాద్, నర్సంపేట ఆర్డీవో ఉమారాణి, నర్సంపేట, నెక్కొండ, చెన్నారావుపే, దుగ్గొండి, ఖానాపురంతహసీల్దార్లు అధికారులు పాల్గొన్నారు.
