TG | కులగణనపై రిపోర్ట్ రెడీ.. రేపు కేబినెట్ సబ్ కమిటీ సమావేశం !
ప్లానింగ్ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన కుల గణన సర్వే నివేదికను సిద్ధం చేసింది. ఈ నివేదికను ఫిబ్రవరి 2న కేబినెట్ సబ్‌కమిటీకి ప్లానింగ్ కమిషన్ సమర్పించనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ రేపు భేటీ కానుంది. కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఆయన ఛాంబర్లో కమిటీ సమావేవం కానుంది. ఈ భేటీలో ప్లానింగ్ కమిషన్ సమర్పించిన కుల గణన నివేదికపై కమిటీ చర్చించనుంది.
ఫిబ్రవరి 5వ తేదీ ఉదయం తెలంగాణ కేబినెట్ సమావేశమై కులగణన నివేదికను ఆమోదించనుంది. అదే రోజు మధ్యాహ్నం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించి కులగణన నివేదికను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. నివేదికపై చర్చ అనంతరం కుల గణన నివేదికకు అసెంబ్లీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. కుల గణన నివేదిక ఆమోదం పొందిన తర్వాత బీసీ రిజర్వేషన్లను ఖరారు చేసి దాని ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.