Chityala | చాయ్ తాగుతూ ప్రజలతో మమేకమై…

Chityala | చిట్యాల, ఆంధ్రప్రభ : గత రెండున్నర ఏళ్ల కాలంలో చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో జరిగిన అభివృద్ధి శూన్యమని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించారు. ఈ రోజు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నకిరేకల్ మాజీ శాసనసభ్యుడు చిరుమర్తి లింగయ్య పలు వార్డులలో పర్యటించారు.

పట్టణ ప్రజలతో మమేకమై చాయ్ తాగుతూ పట్టణ ప్రముఖులతో, ఓటర్లతో మాట్లాడుతూ… వారి సమస్యలను, అభిప్రాయాలను తెలుసుకుంటూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా మాఆర్ఎస్ పార్టీ పాలనలో మున్సిపాలిటీకి తీసుకున్న అభివృద్ధి చర్యలు, సంక్షేమ పథకాలను గుర్తు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి మున్సిపాలిటీ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.