TG | ధూప దీప నైవేద్య పథకం అమలు..

TG | ధూప దీప నైవేద్య పథకం అమలు..

TG, కొత్తకోట, ఆంధ్ర ప్రభ : తెలంగాణ దేవాలయాల సంక్షేమం అభివృద్ధిలో భాగంగా కొత్తకోట మున్సిపల్ పట్టణ కేంద్రంలోని కోట్ల ఆంజనేయ స్వామి ఆలయ నిర్వహణకు రాష్ట్ర దేవాదాయ శాఖ (డిడిఎన్ఎస్) నిత్య ధూప దీప నైవేద్యా పథకం అమలు చేస్తున్నట్లు దేవరకద్ర ఎమ్మెల్యే జిఎంఆర్ ఆలయ అర్చకులు రామారావు శర్మకు ఆర్డర్ కాపీని అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు జనార్దన్ రెడ్డి , శ్రీనివాస్ రెడ్డి, అర్చకులు రామారావు శర్మ ఎమ్మెల్యే జిఎంఆర్ కు పట్టణ కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతాభినందనలు తెలియజేశారు.

అనంతరం ఆలయ కమిటీ నిర్వాహకులు మాట్లాడుతూ.. భారత సంప్రదాయాలను గౌరవిస్తూ ప్రభుత్వాలు ఈ పథకం అమలు చేయడం పట్ల చాలా వరకు చిన్న గుళ్లు జీవం పోసుకుంటున్నాయన్నారు. అంతే కాకుండా.. అర్చకులకు గౌరవ భృతి అందించడం ద్వారా వారి జీవనోపాధికి భరోసా, ఆర్థిక స్థిరత్వం కలిగిస్తూ ఆలయాల్లో నిత్య పూజలు కొనసాగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జిఎంఆర్ తోపాటు కాంగ్రెస్ నాయకులు అర్చకులు రామారావు శర్మ, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply