Telangana | తండ్రీ కొడుకుల మధ్య గొడవ..

Telangana | తండ్రీ కొడుకుల మధ్య గొడవ..
- ఆపేందుకు వెళ్లిన నానమ్మ మృతి
Telangana | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : తండ్రీ కొడుకులు గొడవ పడుతుండగా.. మధ్యలోకి వెళ్లిన నానమ్మ మృతిచెందిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని హనుమకొండ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని ఐనవోలు మండలం పెరుమండ్లగూడెంలో తండ్రీకొడుకుల మధ్య జరిగిన గొడవలో జోక్యం చేసుకున్న నానమ్మ ఐలమ్మ (60) మృతి చెందింది.
మద్యం మత్తులో ఉన్న తండ్రి కొమురయ్య, కుమారుడు బన్నీల మధ్య గొడవ జరుగుతుండగా, వారిని ఆపేందుకు వెళ్లిన ఐలమ్మపై ఇటుక దాడి జరిగింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై ఐనవోలు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
