HYD | ఫ్లైఓవర్‌పై కారు బోల్తా

HYD | ఫ్లైఓవర్‌పై కారు బోల్తా
HYD | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఫ్లైఓవర్‌పై కారు బోల్తాపడిన ఘటన హైదరాబాద్ నగరంలోని బేగంపేటలో చోటుచేసుకుంది. మితిమీరిన వేగంతో వచ్చిన ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో బోల్తాపడింది. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. కాగా, కారును డ్రైవ్ చేసిన వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. రోడ్డుకు అడ్డంగా కారు బోల్తా పడటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
