20 Overs Iముంబై ఇండియన్స్‌కు భారీ లక్ష్యం.. ఓడితే ఇంటికే

20 Overs I ముంబై ఇండియన్స్‌కు భారీ లక్ష్యం.. ఓడితే ఇంటికే

20 Overs I ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్‌: ఐపీఎల్ 2026లో భాగంగా వాంఖడే స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బౌలర్లు చేతులెత్తేశారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై నిర్ణయాన్ని తప్పుబట్టేలా లక్నో బ్యాటర్లు విరుచుకుపడ్డారు. నిర్ణీత 20 ఓవర్లలో లక్నో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోరు సాధించింది.

క్రీజులోకి వచ్చినప్పటి నుండి పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 21 బంతుల్లోనే 63 పరుగులు (1 ఫోర్, 8 సిక్సర్లు) చేసి ముంబై బౌలర్లను వణికించాడు. ఓపెనర్ మిచెల్ మార్ష్ (44) శుభారంభం ఇవ్వగా, చివర్లో హిమ్మత్ సింగ్ (40), ఎయిడెన్ మార్క్రామ్ (31) ధాటిగా ఆడి స్కోరును 220 దాటించారు. స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా 4 ఓవర్లలో వికెట్ లేకుండానే 45 పరుగులు సమర్పించుకున్నాడు. కార్బిన్ బాష్ 2 వికెట్లు తీయగా, ఘజన్‌ఫర్, విల్ జాక్స్, రఘు శర్మ తలో వికెట్ పడగొట్టారు. ముంబై ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో ఖచ్చితంగా 229 పరుగులు చేయాల్సి ఉంది. ఓడితే మాత్రం టోర్నీ నుండి అధికారికంగా నిష్క్రమించాల్సి వస్తుంది.