Jainoor | ముగిసిన జై జంగో జై లింగో దీక్షలు

Jainoor | ముగిసిన జై జంగో జై లింగో దీక్షలు

  • వందలాదిగా తరలివచ్చిన దీక్షపరులు
  • కిట కిటలాడిన దీక్ష భూమి ఆవరణ

Jainoor | జైనూర్, ఆంధ్రప్రభ : ఆదివాసి గిరిజనులు పుష్య మాసంలో స్వీకరించిన జే జంగు జై లింగు దీక్షలు కొన్ని రోజుల పాటు భక్తిశ్రద్ధలతో సాంప్రదాయ బద్ధంగా నిర్వహించారు. ఇవ్వాళ కొమరం భీం అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని జంగాం పంచాయతీలోని రాంజీగూడ లోని జై జంగు జై లింగు దీక్ష భూమికి వందలాదిమంది దీక్షాపరులు తరలివచ్చి కిషన్ మహారాజ్ చేతుల మీదుగా కంకణాలు తొలగించి దీక్షలను విరమించారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు మహారాష్ట్రకు చెందిన దీక్షలు స్వీకరించిన, దీక్ష పరులు వానాల ద్వారా పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీక్షపరులతో దీక్ష భూమి ఆవరణ కిట కిటలాడింది. ఘన్ సంస్థాన్ కమిటీ నిర్వాకులు భిక్షాపరుల కోసం అన్ని ఏర్పాట్లతో పాటు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జై జంగు జై లింగు దీక్ష పీఠం గురువు కుమ్ర భగవంతురావు, ఘన్ సంస్థాన్ కమిటీ నిర్వాహకులు, ఆదివాసీలు, దీక్షపరులు పాల్గొన్నారు.

Jainoor

Leave a Reply