Pooja Hegde | పాన్ ఇండియా స్టార్‌తో గొడవ పడిందా..?

Pooja Hegde | పాన్ ఇండియా స్టార్‌తో గొడవ పడిందా..?
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే.. గత కొంతకాలంగా సరైన సక్సెస్ లేక కెరీర్ లో వెనబడింది. ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్ అన్నట్టుగా ఒక్క హిట్.. ఒకే ఒక్క హిట్ అంటుంది. అయినా.. ఆశించిన సక్సెస్ రావడం లేదు. ఇదిలా ఉంటే.. ఈ అమ్మడు. పాన్ ఇండియా స్టార్ ను కొట్టిందని.. ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ.. ఆ పాన్ ఇండియా స్టార్ హీరో ఎవరు..? ప్రచారంలో ఉన్నట్టుగా నిజంగానే పూజా కొట్టిందా..? లేక ఇదంతా గాపిప్పా..?

ఓ సౌత్ సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడు.. తన పర్మిషన్ లేకుండా పూజా క్యారవాన్ లోకి ఓ పాన్ ఇండియా స్టార్ వచ్చాడని.. అప్పుడు పూజా ఆ హీరోని చెంప దెబ్బ కొట్టిందని ప్రచారం జరుగుతుంది. ఇదంతా ఆమె ఓ ఇంటర్ వ్యూలో బయటపెట్టినట్టుగా న్యూస్ వైరల్ అవుతోంది. అంతే కాకుండా.. అప్పటి నుంచి ఆ స్టార్ హీరోతో నటించేందుకు పూజా ఓకే చెప్పడం లేదని కూడా వార్తలు వస్తున్నాయి. ఇదంతా పూజానే చెప్పిందని ప్రచారం జరుగుతుంది. అయితే.. అసలు పూజా ఏ ఇంటర్ వ్యూలో కూడా ఇలా మాట్లాడలేదని.. కావాలనే ఓ హీరోను టార్గెట్ చేస్తూ ఇలా పుకార్లు పుట్టిస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

మరో వైపు ఇదే నిజమే అని కూడా కొంత మంది న్యూస్ స్ప్రెండ్ చేస్తున్నారు. దీంతో పూజా నిజంగా కొట్టిందా..? ఇదే నిజమైతే.. ఆ హీరో ఎవరు అనే చర్చ మొదలైంది సోషల్ మీడియాలో. అమ్మాయిలకు దూరంగా ఉంటాడు. అలాంటి హీరో ఇలా చేయడం ఏంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్లు ఆ హీరో ఇతనే అంటూ ఊహించుకుంటున్నారు. అసలు ఏం జరిగిందో.. జరిగిందో లేదో తెలియదు కానీ.. పూజా ఈ విధంగా మరోసారి వార్తల్లో నిలిచింది. మరి.,. ప్రచారంలో ఉన్న ఈ వార్తల పై పూజా క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.

