Rs.510 crore | బీఆర్ఎస్ బలపాటుకు భారీ చేరికలు
Rs.510 crore | బీఆర్ఎస్ బలపాటుకు భారీ చేరికలు
Rs.510 crore | గోదావరిఖని టౌన్, ఆంధ్రప్రభ : తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ శ్రీరామరక్ష అని, రామగుండంలో బీఆర్ఎస్ మేయర్ గెలిస్తేనే ఈ ప్రాంత అభివృద్ధి సాధ్యమవుతుందని రామగుండం మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ స్పష్టం చేశారు. ఈ రోజు రామగుండం 13వ డివిజన్లో సామాజిక కార్యకర్త కటుకు స్వాతి ప్రవీణ్‌తో పాటు సుమారు 200 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కోరుకంటి చందర్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇచ్చిన అభయహస్తం కార్డు హామీలను నెల రోజుల్లో అమలు చేస్తామని చెప్పి విఫలమయ్యారని విమర్శించారు. వృద్ధులకు రూ.4,000 పెన్షన్, మహిళలకు రూ.2,500 ఆర్థిక సహాయం, కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు తులం బంగారం, విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.

మోసం చేయడం కాంగ్రెస్ పార్టీ నైజమని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు అడగడానికి వచ్చే కాంగ్రెస్ నాయకులను అభయహస్తం బాకీ కార్డులు చూపించి హామీలు ఎందుకు నెరవేర్చలేదని నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గత రెండు సంవత్సరాలుగా రామగుండం నియోజకవర్గంలో అభివృద్ధి పేరుతో కమీషన్లు, కూల్చివేతలే జరిగాయని, చిరు వ్యాపారుల దుకాణాలు కూల్చి వారిని రోడ్డున పడేశారని విమర్శించారు.

తాము ఐదేళ్ల పాలనలో పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పరిపాలన సాగించామని చెప్పారు. దశాబ్దాల కల అయిన మెడికల్ కళాశాలను రామగుండానికి తీసుకువచ్చి రూ.510 కోట్ల(Rs.510 crore)తో నిర్మాణానికి చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు. అలాగే సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఈ ప్రాంతానికి తీసుకువచ్చామని తెలిపారు.

రామగుండం పారిశ్రామిక ప్రాంత అభివృద్ధి జరగాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా 13వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కటుకు స్వాతి ప్రవీణ్‌ను ఆయన ప్రకటించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు మిర్యాల రాజి రెడ్డి, మూల విజయ రెడ్డి, గోపు అయులయ్య యాదవ్, పర్లపల్లి రవి, నారాయణదాసు మారుతి, మాజీ కార్పొరేటర్ రాకంలత, దామోదర్, కుడుదుల శ్రీనివాస్, నూనే కొంరయ్య, బొడ్డు రవీందర్, చిప్ప రాజేష్, చెలకలపల్లి శ్రీనివాస్, రాకం దామోదర్, కలవేన మల్లేష్, శంకర్, దండే మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
CLICK HERE TO READ MORE : Election | ఖమ్మంలో నేనే పోటీ చేస్తా..
