Training program | సర్పంచులు నిష్పక్షపాతంగా పని చేయాలి..

Training program | సర్పంచులు నిష్పక్షపాతంగా పని చేయాలి..

  • పల్లె పాలన పై పట్టు సాధించాలి
  • పంచాయతీ రాజ్, గ్రామీణభివృద్ధి శాఖ కమిషనర్ శృతి ఓజా

Training program | జనగామ, ఆంధ్రప్రభ : గ్రామ అభివృద్ధిలో సర్పంచ్ ల పాత్ర కీలకమని పంచాయతీ రాజ్, గ్రామీణభివృద్ధి శాఖ కమిషనర్ శృతి ఓజా అన్నారు. ఈ రోజు జిల్లా కేంద్రంలోనీ ఒక ప్రైవేటు కళాశాలలో 5 రోజుల పాటు జరిగే శిక్షణ కార్యక్రమాన్ని పంచాయతీ రాజ్, గ్రామీణభివృద్ధి శాఖ కమిషనర్ శృతి ఓజా, జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్, జడ్పీ సీఈఓ మాధురి, ఇంచార్జి డీపీవో వసంత జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

కొత్తగా ఎన్నికైన సర్పంచ్ లకి గ్రామ పంచాయతీ పాలన, విధులు, అభివృద్ధికి సంబందించిన వివిధ అంశాల పైన శిక్షణ ఏర్పాటు చేయగా మొదటి విడతలో భాగం గా పాలకుర్తి, దేవరోప్పుల, కొడకండ్ల మండలాలకు సంబందించిన సర్పంచ్ లు పాల్గొన్నారు. పరిచయ కార్యక్రమం అనంతరం పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ శృతి ఓజా మాట్లాడుతూ… సర్పంచ్ లకు ఏర్పాటు చేసిన ఈ శిక్షణ కార్యక్రమం పల్లెల్లో సుపరిపాలనకు బాటలు వేయనుందన్నారు.

గ్రామాలలో అన్ని రకాలుగా అభివృద్ధి జరగాలి అంటే బాధ్యతాయుతంగా సర్పంచ్ లు పని చేయాలన్నారు. సర్పంచ్ లు బాగా పని చేస్తేనే రాష్ట్ర స్థాయిలో వారి గ్రామాలకు మంచి పేరు వస్తుందన్నారు. పంచాయతీ రాజ్ చ‌ట్టంలో సర్పంచ్ లకు పొందుపరిచిన అధికారాలు, విధులు తదితర అంశాలను శిక్షణలో భాగంగా క్షుణ్ణంగా అవగాహన చేసుకోవాలన్నారు. గ్రామాల్లో శానిటేషన్ నిర్వహణ, త్రాగు నీటి ఎద్దడి లేకుండా చూడడం లాంటి ప్రధాన అంశాల్లో సర్పంచ్ లు చురుకుగా పని చేయాలిసిన అవసరం ఉంటుందన్నారు.

ప్రతీ గ్రామం శుభ్రం గా, పచ్చదనంతో ఉండాలన్నారు. జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ… పంచాయతీ రాజ్ చట్టంలోని ప్రతీ అంశాన్ని సర్పంచ్ లు అవగాహన కలిగి ఉండాలన్నారు. విద్య, వైద్యం నిరుపేదలకు అందేలా సర్పంచ్ లు కృషి చేయాలన్నారు. మానవత్వ కోణంలో పని చేయాలనీ సూచిస్తు డిజిటల్ గవర్ననెన్స్ కి దోహద పడాలన్నారు. సర్పంచ్ లకి ట్రైనింగ్ కిట్స్ ని అందించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ శాఖ అధికారులు, సర్పంచ్ లు పాల్గొన్నారు.

Leave a Reply