Don’t Kill Them | దోమలను ఏం చేస్తున్నారు?

Don’t Kill Them | దోమలను ఏం చేస్తున్నారు?
- ప్రముఖ నటి రేణు దేశాయ్
Don’t Kill Them | వెబ్‌డెస్క్, ఆంధ్రప్రభ : వీధి కుక్కలను నిర్మూలించడానికి తీసుకుంటోన్న చర్యలను ప్రముఖ నటి రేణు దేశాయ్ ఖండించారు. కుక్కలను చంపడం హత్యలుగా ఆమె అభివర్ణించారు. వాటిని నిర్మూలించడానికి చేపట్టిన చర్యలు అత్యంత అన్యాయమైనవని, మానవత్వం లేనివని అన్నారు. చిన్నపిల్లలను కరుస్తున్నాయనే కారణంతో వీధి కుక్కల పట్ల క్రూరంగా ప్రవర్తించడం సరికాదని అన్నారు.
ప్రజా భద్రత పేరుతో జంతువులను లక్ష్యంగా చేసుకోవడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదాలకు కుక్కలను నిందించడం పట్ల రేణు దేశాయ్ అభ్యంతరం తెలిపారు. హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో ఆమె తాజాగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
Don’t Kill Them | వాటిని ఎవరూ పట్టించుకోరా..?
తమ చుట్టు పక్కల ఆడపిల్లలు లైంగిక వేధింపులకు గురి అవుతున్నా ఎవరూ పట్టించుకోవట్లేదని, హెల్మెట్ పెట్టుకోకపోతే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ప్రాణం పోతుందని తెలిసినా ఎవరూ దాన్ని అనుసరించట్లేదని, అప్పుడు లేవని నోళ్లు ఇప్పుడెందుకు లేస్తోన్నాయని రేణుదేశాయ్ అన్నారు. మానవ ప్రాణ నష్టం పలు కారణాల వల్ల జరుగుతున్నా, అలాంటి సందర్భాలలో తీవ్ర చర్యలు ఉండవని, కుక్కుల కరుస్తోన్నాయనే ఉద్దేశంతో వాటిని నిర్మూలించడం అమానుషమని పేర్కొన్నారు.
కొన్ని కుక్కలు జనాన్ని ఇబ్బందులకు గురి చేస్తోన్నాయనే కారణంతో అన్నిటినీ శిక్షించడం మానవత్వం అనిపించుకోదని స్పష్టం చేశారు. దోమల నివారణం ఏం చర్యలు తీసుకున్నారని రేణు దేశాయ్ ప్రశ్నించారు. డెంగ్యూతో చిన్నపిల్లలు చనిపోతున్నారని, వాటిని అరికట్టగలిగారా? అని నిలదీశారు. ప్రాణాంతకంగా ప్రవర్తించే కుక్కలు చాలా తక్కువ సంఖ్యలో ఉంటాయని, వాటిని మాత్రమే పరిష్కరించాలి తప్ప సామూహిక హత్యలకు దిగొద్దని అన్నారు.
