Kamareddy | బంగారు ఆభరణాల కోసం తల్లిపై కొడుకు దాడి

Kamareddy | బంగారు ఆభరణాల కోసం తల్లిపై కొడుకు దాడి

  • అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • వివరాలు వెల్లడించిన ఏ ఎస్ పి చైతన్య రెడ్డి

Kamareddy | కామారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని వివేకానంద కాలనీ, మున్సిపల్ కార్యాలయం పక్కన ఉన్న అపార్ట్‌మెంట్‌లో జరిగిన హత్యా యత్యారి్ఇ పోలీస్‌లు వేగంగా స్పందించి నిందితుడిని అదుపులోకి తీసుకొని కీలక వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఫిర్యాదు దారుడు కంచర్ల శంకర్ (57 సం.), వాచ్‌మెన్, వివేకానంద కాలనీ, కామారెడ్డి వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేవారు. ఫిర్యాదు వివరాల ప్రకారం నిందితుడు కంచర్ల రాజేష్ (ఫిర్యాదిదారుడి కుమారుడు) మద్యం సేవించి ఇంటికి వచ్చి తన తల్లి కంచర్ల గౌరవ్వ (56 సం.)తో గొడవ పడి, ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును అమ్మి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.

అనంతరం నేరపూరిత ఉద్దేశ్యంతో తన తల్లిపై ఇనుప కడియం ఇనుప రాడ్‌తో ముఖం, తలపై పదేపదే దాడి చేసి తీవ్రమైన గాయాలకు కారణమయ్యాడు. గాయపడిన మహిళను వెంటనే పోలీసు పెట్రోలింగ్ కారులో కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తదుపరి జిల్లా ఎస్పీ ఆదేశానుసారం కామారెడ్డి ఏఎస్పీ చైతన్య సూచనల మేరకు పట్టణ ఇన్‌స్పెక్టర్ నరహరి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుడిని 24 గంటలలోపు పట్టుకున్నారు. అతని వద్ద నుండి దొంగ సొత్తు, నేరానికి ఉపయోగించిన ఆయుదాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

నిందితుడి వివరాలు కంచర్ల రాజేష్ ఇంటి నెంబరు 1-4-202, పీఎంహెచ్ కాలనీ, కామారెడ్డి, ప్రస్తుతం వివేకానంద కాలనీ, కామారెడ్డి పోలీసు విచారణలో భాగంగా నిందితుడు కంచర్ల రాజేష్‌ను అదుపులోకి తీసుకొని, అతని వద్ద నుండి దాడికి ఉపయోగించిన ఇనుప కడియం, బాధితురాలి మెడ నుండి తీసుకున్న మూడు తులాల బంగారు గొలుసులను స్వాధీనం చేసుకున్నామ‌న్నారు. ఈ కేసులో నిందితుడిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటూ, తదుపరి దర్యాప్తు కొనసాగుతుందన్నారు.

Leave a Reply