RTC Bus Stand | బస్సు ఎక్కేందుకు తొక్కిసలాట..

RTC Bus Stand | బస్సు ఎక్కేందుకు తొక్కిసలాట..

  • నలుగురికి తీవ్రగాయాలు

RTC Bus Stand | అంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా వినుకొండలో ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు ఎక్కేందుకు ప్రయాణికులు పోటీపడటంతో తొక్కిసలాట జరిగి నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వినుకొండ ఆర్టీసీ బస్టాండ్ గ్యారేజ్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. పండుగ సెలవులు పూర్తి కావటంతో తిరుగు ప్రయాణాలతో బస్టాండులో రద్దీ పెరిగింది. ఈ క్రమంలోనే విజయవాడ బస్సు ఎక్కే సమయంలో ప్రయాణికుల మధ్య తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు.

Leave a Reply