Minister | వివేక్‌ను విమర్శిస్తే సహించం

Minister | వివేక్‌ను విమర్శిస్తే సహించం
- కాంగ్రెస్ నాయకులు
Minister | చెన్నూర్, ఆంధ్రప్రభ : చెన్నూరు ఎమ్మెల్యే, కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిపై మాజీ జడ్పి వైస్ ఛైర్మెన్ మూల రాజిరెడ్డి చేసిన వ్యాఖ్యలను స్థానిక కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఇవాళ స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో నూతన మార్కెట్ కమిటీ చెర్మెన్ మహేష్ ప్రసాద్ తివారీ, కోటపెల్లి మండల సీనియర్ నాయకులు పోటు రాంరెడ్డి, స్థానిక కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ… మూల రాజిరెడ్డి మరోసారి మంత్రి వివేక్ వెంకటస్వామిపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. మంత్రి వివేక్ వెంకటస్వామి చెన్నూరు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఆరోపించడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.
అసలు మూల రాజిరెడ్డికి కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం ఉందా అని రాంరెడ్డి ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ పాలనలో రాజిరెడ్డి ఇసుక, భూ దందాలు నడవడం లేదనే కాంగ్రెస్ పార్టీలో చేరి ఇప్పుడు మంత్రి తన దందాలకు సహకరిస్తలేడనీ ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇస్తున్నాడని ఆరోపించారు.
మంత్రి వివేక్ వారానికి రెండు సార్లు నియోజకవర్గంలో పర్యటిస్తూ స్థానిక ప్రజల సమస్యల పరిష్కరిస్తూ స్థానికంగా ఉంటూ ఎలాంటి అక్రమ దందాలకు తావివ్వకుండా పాలన సాగిస్తున్నారని, కావాలనే కొందరు కాంగ్రెస్ పార్టీని, మంత్రి వివేక్ ను విమర్శించడమే ఎజెండాగా పెట్టుకున్నారని, వారి మాటలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఇప్పటికైనా రాజిరెడ్డి తన వైఖరి మార్చుకొని మంత్రిని విమర్శించడం మానుకోవాలన్నారు. మంత్రి చేసే అభివృద్ధిని ప్రజలు గమనిస్తున్నారని గుర్తుపెట్టుకోవాలన్నారు.
