Gudivada | ప్రభుత్వం పట్టించుకోదా..?

Gudivada | ప్రభుత్వం పట్టించుకోదా..?
- విచ్చలవిడిగా కోడిపందేలు, జూదం
- ప్రజా ప్రతినిధులపై చర్యలు తీసుకోవాలి
- సీపీఎం డిమాండ్
Gudivada | గుడివాడ, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో కోడిపందేలు, జూదం విచ్చలవిడిగా నడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సీపీఎం నాయకులు ఆర్‌సీపీ.రెడ్డి అన్నారు. ఈ రోజు గుడివాడలో ఆయన మాట్లాడుతూ కత్తులు లేకుండా కోడిపందేలు నిర్వహించండని హైకోర్టు చెప్పటం అట్లాగే ఈరోజు రాష్ట్రంలో జంతు హింస నిరోధక చట్టం 1960లోను అట్లాగే ఏపీ జూదం నిరోధక చట్టం 1974 చట్టాలు ఉన్నాయన్నారు. ఈ చట్టాల ప్రకారం కూడా అది కంట్రోల్ చేయాల్సిన ప్రభుత్వాలు చూసి చూడనట్టు వ్యవహరిస్తుందన్నారు. హైవేలు, రోడ్లు పక్కన కూడలి ప్రాంతాల్లో ఈ జూదాలు నడుస్తున్నాయన్నారు.
జూదంతో పాటు సంక్రాంతి సంబరాలు అనే పేరుతో కోడిపందేలు నిర్వహిస్తూ కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయని, ప్రభుత్వాలు పట్టించుకోని పరిస్థితి ఉంది. పోలీసులు సంక్రాంతి ముందు హడావిడి చేస్తున్నారు. సంక్రాంతి పండగ వచ్చిన మూడు రోజులు మాత్రమే పోలీసులు అసలు వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడ ఫొటోలు పెట్టారో ఆ ఫొటోలు మీద హైకోర్టు యాక్షన్ తీసుకుంటే వాళ్ళు భయపడి ఇంకోసారి వాళ్ళ ఫొటోలు అవి లేకుండా చర్యలు చేపడట్టడం జరుగుతుందన్నారు. కాబట్టి వీటిని తగ్గించడానికి నిరోధించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. మండల కమిటీ సభ్యులు ఆర్ కొండ తదితరులు పాల్గొన్నారు.
