Jaithapur | లక్ష పిడకలతో భోగి మంటలు..
Jaithapur | లక్ష పిడకలతో భోగి మంటలు..
Jaithapur, ఆంధ్రప్రభ : ఎడపల్లి మండలం జైతపూర్ గ్రామంలో బుధవారం భోగి పండగ సంబరాలు అంబరాన్ని అంటాయి. గ్రామస్తులు ఆవు పేడతో తయారు చేసిన లక్ష పిడకల హారాన్ని గ్రామాలలోని పురవీధుల గుండా ఊరేగించి బోగి మంటలలో వేసి సంబరాలు నిర్వహించారు. భోగి సందర్భంగా గ్రామంలో ఆడపడుచులు తమ ఇంటి ముందు వేసిన రంగురంగుల రంగు వల్లికలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. పండగ సందర్భంగా గ్రామంలో మహిళలు, పురుషులు, సాంప్రదాయ వస్త్రాలు ధరించి భోగి వేడుకల్లో పాల్గొన్నారు. గ్రామ ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.
