Kareemabad | సంక్షేమం కోసం పాటుపడుతున్న బీఆర్ఎస్

Kareemabad | సంక్షేమం కోసం పాటుపడుతున్న బీఆర్ఎస్

  • మాజీ ఎమ్మెల్యే నరేందర్
  • పార్టీ నూతన క్యాలెండర్ డైరీ ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే

Kareemabad | కరీమాబాద్, ఆంధ్రప్రభ : నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని విడుదల చేసిన బీఆర్‌ఎస్ పార్టీ క్యాలెండర్ డైరీని వరంగల్ తూర్పు మాజీ శాసనసభ్యులు నన్నపునేని నరేందర్ ఇవాళ‌ శివనగర్ లోని నరేందర్ క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి ప్రజల సంక్షేమం, అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని బీఆర్‌ఎస్ పార్టీ పనిచేస్తోందని, రాబోయే కాలంలో కూడా పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో వరంగల్ తూర్పు బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, ఇన్చార్జులు, మాజీ ప్రజా ప్రతినిధులు, మహిళా నాయకురాలు, యువజన నాయకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply