Muttukuru | విరూపాక్షేశ్వర స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ

Muttukuru | విరూపాక్షేశ్వర స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ
Muttukuru | ముత్తుకూరు, ఆంధ్రప్రభ : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలంలోని ఈపూరు గ్రామం ఆరాధ్య దైవం విరూపాక్షేశ్వర స్వామిని రాష్ట్ర మంత్రి పి.నారాయణ ఇవాళ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు మంత్రికి పూర్ణకుంభంతో ఆలయ ప్రవేశం కల్పించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఆయన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలు ఘనంగా పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
