JakranPally | ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్న రైతులు

JakranPally | జక్రన్ పల్లి, ఆంధ్రప్రభ : జక్రన్ పల్లి మండలం వివిధ గ్రామాలలోని ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలకు, కొలిప్యాక్ గ్రామాలలోని కుంటి వాగు నుండి తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను గ్రామ రైతులు అడ్డుకున్నారు. కుంటి వాగును ఆనుకొని పదిహేను మంది రైతుల ఎనిమిది ఎకరాల పట్టా భూములు ఉన్నాయని, ఇసుక తవ్వకాలు చేపట్టడంతో ప్రస్తుతం రెండు ఎకరాల వరకు తమ భూములు కోతకు గురి అయ్యాయని, రైతులు వాగులో నిరసన తెలిపారు. అనంతరం రైతులు తమకు న్యాయం చేయాలని జక్రన్ పల్లి ఎమ్మార్వో కిరణ్మయికి వినతి పత్రం అందజేశారు.
