ఆర్థిక సహాయం మంజూరు హర్షణీయం..

ఆర్థిక సహాయం మంజూరు హర్షణీయం..
నియోజకవర్గంలో 9,158 మంది మత్స్యకారులకు మొత్తం రూ.18,31,60,000లు ఆర్థిక సహాయం
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదములు : ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్
అవనిగడ్డ, ఆంధ్రప్రభ : “మత్స్యకార సేవలో” పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గంలోని 9,158మంది లబ్ధిదారులకు వేట విరామ భృతి నిమిత్తం ఆర్థిక సహాయం మంజూరు చేసినట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. మంగళవారం అవనిగడ్డలోని తమ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వేసవిలో సముద్రంలో మత్స్య సంపద వృద్ధికి అనువుగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న వేట విరామం సమయంలో మత్స్యకారుల జీవనం కోసం ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఏటా రూ.20వేలు ఆర్థిక సహాయం అందిస్తోందని తెలిపారు.
“మత్స్యకారుల సేవలో ” పథకం ద్వారా నాగాయలంక మండలంలోని 7,620 మంది మత్స్యకారులకు రూ.15,24,00,000లు, కోడూరు మండలంలో 1,538 మంది మత్స్యకారులకు రూ.3,07,60,000లు ఆర్థిక సహాయం నేరుగా మత్స్యకార సోదరుల బ్యాంక్ ఖాతాలకు డీబీటీ పద్ధతిలో జమ చేసిందని తెలిపారు. మత్స్యకారుల వేట విరామానికి సీఎం చంద్రబాబు భరోసా ఇస్తూ నియోజకవర్గంలో మొత్తం 9,158 మంది మత్స్యకారులకు మొత్తం రూ.18,31,60,000లు ఆర్థిక సహాయం అందించినట్లు వివరించారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఏటా హామీని సకాలంలో నెరవేర్చుతూ మత్స్యకార సోదరులకు అండగా నిలుస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ నియోజకవర్గ లబ్ధిదారుల తరపున ధన్యవాదములు తెలిపారు.
