KPL Transformer | మంటలతో భయాందోళనకు గురైన కార్మికులు

KPL Transformer | మంటలతో భయాందోళనకు గురైన కార్మికులు
KPL Transformer | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : సంగారెడ్డి జిల్లాలోని రుద్రారంలో ఉన్న కేపీఎల్ ట్రాన్స్‌ఫార్మర్ కంపెనీలో స్వల్ప అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వ్యర్థాలను తగలబెట్టే సమయంలో మంటలు ఒక్కసారిగా ఎగసిపడటంతో కంపెనీ ప్రాంగణంలో కలకలం రేగింది.
అగ్నిప్రమాదం సంభవించడంతో కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. ఘటనతో కొంతసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు.
