8 teams| ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేస్ ర‌స‌వ‌త్త‌రం

8 teams| ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేస్ ర‌స‌వ‌త్త‌రం

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఐపీఎల్ 2026 సీజన్ క్లైమాక్స్‌కు చేరుకుంది. లీగ్ స్టేజ్ ముగియడానికి ఇంకా పది రోజులే ఉంది. ఏ జట్లు ప్లే ఆఫ్స్‌నకు చేరుతాయి అనే టెన్ష‌న్ నెల‌కొంది. ఈసారి ప్లేఆఫ్స్ పోటీ చాలా ఉత్కంఠగా ఉంది. ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసులో 8 జట్లు 4 బెర్తుల కోసం నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నాయి. కొన్ని జట్లు వరుస విజయాలతో దూసుకుపోతుంటే, మరికొన్ని టీమ్స్ కీలక సమయంలో తడబడుతూ అభిమానులను టెన్షన్ పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్లేఆఫ్స్​కు చేరేందుకు ఏ జట్టుకు ఎంత అవకాశం ఉంది? ఏ రెండు జట్లు టాప్ 2లో నిలిచే అవకాశం ఉంది? అనే విషయంపై ఓ లుక్కేద్దాం.

ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు తీవ్ర ఉత్కంఠగా మారింది. బెంగ‌ళూర్‌, గుజ‌రాత్‌, హైద‌రాబాద్‌, పంజాబ్‌, చెన్నై టాప్-4లో నిలిచే అవకాశం ఉంది. గుజ‌రాత్‌, బెంగ‌ళూర్ దాదాపుగా 16+ పాయింట్లతో అర్హతకు చేరువలో ఉండగా, సన్‌రైజర్స్, పంజాబ్, చెన్నై, రాజస్థాన్, కోల్‌క‌తా, ఢిల్లీ మిగిలిన స్థానాల కోసం పోటీపడుతున్నాయి. ముంబై, లక్నో ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ బలమైన పోటీలో ఉన్నాయి.

Leave a Reply