Uttar Pradesh | 89 మంది మృతి..

Uttar Pradesh | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : ఉత్తర్‌ప్రదేశ్‌లో తీవ్ర గాలి దుమారం, భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ప్రయాగ్‌రాజ్, భదోహి, సోన్‌భద్ర, ఫతేపుర్ తదితర జిల్లాల్లో చోటుచేసుకున్న వేర్వేరు ఘటనల్లో మృతిచెందిన వారి సంఖ్య 89కి చేరినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రకృతి విపత్తుతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నష్టం సంభవించింది.
భారీ ఈదురు గాలులు, వర్షాల కారణంగా అనేక చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడగా, నివాస గృహాలు కూడా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనల్లో మరో 53 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు.
పరిస్థితిని సమీక్షించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బాధితులకు వెంటనే సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. సహాయక చర్యలను వేగవంతం చేసి, ప్రభావిత ప్రాంతాల్లో పునరుద్ధరణ పనులు చేపట్టాలని సూచించారు.
