6.80 acres | అమరజీవి ఆంధ్రకే కాదు దేశానికి స్ఫూర్తిప్రదాత

6.80 acres | అమరజీవి ఆంధ్రకే కాదు దేశానికి స్ఫూర్తిప్రదాత

జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్

6.80 acres | చిత్తూరు, ఆంధ్రప్రభ : అమరజీవి పొట్టి శ్రీరాములు కేవలం ఆంధ్రప్రదేశ్‌కే కాకుండా భారతదేశానికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ఏ.రాజేంద్రన్ పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్‌లోని బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

కలెక్టరేట్‌లోని సమీక్ష సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ఏ.రాజేంద్రన్, రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ పి.యుగంధర్, రాష్ట్ర బెస్తా కార్పొరేషన్ డైరెక్టర్ పి.తిరుమగల్, రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ జి.అమర్నాథ్, ఆర్యవైశ్య రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ నరసింహులు శెట్టి తదితరులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

6.80 acres |

ఈ సందర్భంగా అమరావతి రాజధానిలోని శాఖమూరు పార్కులో ఏర్పాటు చేసిన 58 అడుగుల ఎత్తైన అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించిన కార్యక్రమాన్ని కలెక్టరేట్‌లో లైవ్ ద్వారా వర్చువల్‌గా వీక్షించారు. పొట్టి శ్రీరాములు 125వ జయంతిని పురస్కరించుకుని రూ.150 కోట్ల అంచనా వ్యయంతో ఈ స్మారక ప్రాజెక్టును చేపట్టగా, 6.80 ఎకరాల విస్తీర్ణంలో మొదటి దశ పనులు పూర్తి చేశారు. పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ కేవలం ఆరు నెలల్లోనే రికార్డు స్థాయిలో పనులు చేపట్టి 58 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం విశేషంగా నిలిచింది.

6.80 acres |

ఈ సందర్భంగా జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ఏ.రాజేంద్రన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అన్న పేరు వినగానే ముందుగా గుర్తుకొచ్చే పేరు అమరజీవి పొట్టి శ్రీరాములు గారిదేనన్నారు. పొట్టి శ్రీరాములు కేవలం ఆంధ్రకే కాకుండా దేశం మొత్తానికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని, భారతదేశం గర్వించదగ్గ మహనీయుడని పేర్కొన్నారు. స్వాతంత్య్రం అనంతరం రాష్ట్రాలను భాషా ప్రాతిపదికన ఏర్పాటు చేయాలా లేదా పరిపాలనా సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలా అనే సందిగ్ధ పరిస్థితిలో ఉన్న సమయంలో భాష ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చే బలమైన శక్తి అని ఆయన తన త్యాగంతో నిరూపించారని తెలిపారు.

6.80 acres |

భాష ద్వారా అక్కడి సంస్కృతి, సంప్రదాయాలు అర్థమవుతాయని, పొట్టి శ్రీరాములు చేసిన మహోన్నత పోరాటం వల్లే నేడు తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందన్నారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని, భావితరాలకు ఆయన త్యాగగాథలను తెలియజేయడం మన బాధ్యత అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అందరికీ పొట్టి శ్రీరాములు జయంతి శుభాకాంక్షలు తెలిపారు.

6.80 acres |

ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ పి.యుగంధర్ మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం తెలుగు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందన్నారు. తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం సాధించాలనే లక్ష్యంతో 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేయడం వల్లే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందన్నారు. ఇటువంటి మహనీయుల చరిత్రను భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.

6.80 acres |

అమరావతి రాజధానిలో పొట్టి శ్రీరాములు గారి గౌరవార్థం 58 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఆయనకు ఇచ్చే నిజమైన గౌరవమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటువంటి చారిత్రక కార్యక్రమాలను చేపట్టి యువతకు ప్రేరణ కల్పిస్తున్నారని తెలిపారు. పొట్టి శ్రీరాములు ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

6.80 acres | ప్రాణాలు అర్పించిన మహానీయుడు పొట్టి శ్రీరాములు

ఆర్యవైశ్య రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ నరసింహులు శెట్టి మాట్లాడుతూ తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం రావాలని నిస్వార్థంగా పోరాడి ప్రాణాలు అర్పించిన మహానీయుడు పొట్టి శ్రీరాములు అని పేర్కొన్నారు. ఆయన త్యాగం ఫలించాలంటే సమాజం ఐక్యంగా ఉండాలని, అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని సూచించారు. ప్రభుత్వం పొట్టి శ్రీరాములు జయంతిని రాష్ట్ర కార్యక్రమంగా నిర్వహించడం అభినందనీయమన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు ద్వారకనాథ్, జనరల్ సెక్రటరీ ఎం.శర్వాన్, బీజేపీ జిల్లా ఈసీ సభ్యుడు సత్య, మహేంద్ర, శ్రీనివాసమూర్తి, డీఆర్‌డీఏ పీడీ శ్రీదేవి, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి రబ్బిన్ భాష తదితరులు పాల్గొన్నారు.

CLICK HERE TO READ MORE : Sanjeevani | పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభం…

CLICK HERE TO READ MORE

Leave a Reply