ప్రపంచాన్ని ఆకర్షించే అమరావతి కూటమి ప్రభుత్వానికి అభినందనలు

ప్రపంచాన్ని ఆకర్షించే అమరావతి కూటమి ప్రభుత్వానికి అభినందనలు

రాష్ట్ర వడ్డెర సంక్షేమ సంఘం అధ్యక్షులు తిరుపతి శ్రీనివాసరావు.

కోడూరు, ఆంధ్ర ప్రభ : ఆంధ్రప్రదేశ్ గర్వకారణమైన అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దే దిశగా కూటమి ప్రభుత్వం వేస్తున్న అడుగులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నట్లు రాష్ట్ర వడ్డెర సంక్షేమ సంఘం అధ్యక్షులు టి ఎస్ఆర్ గ్రూప్ చైర్మన్ తిరుపతి శ్రీనివాసరావు అన్నారు. అభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే పోరాట యోధుడు పవన్ కళ్యాణ్, యువశక్తికి ప్రతీక నారా లోకేష్ కలసి అమరావతిని కేవలం రాజధానిగా కాకుండా ప్రపంచాన్ని ఆకర్షించే అభివృద్ధి చిహ్నంగా తీర్చిదిద్దుతున్నారు అని, అమరావతి అంటే అభివృద్ధి అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్ గౌరవం రైతుల త్యాగాలతో నిర్మితమైన ఈ పవిత్ర భూమిని ప్రపంచ పటంలో నిలిపే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది అని తిరుపతి శ్రీనివాసరావు అన్నారు.

ఈ విజన్ విజయవంతమైతే, అమరావతి భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక ప్రముఖ నగరంగా వెలుగొందుతుంది అని,వడ్డెర సంక్షేమ సంఘం తరఫున ఈ మహత్తర నిర్మాణ యజ్ఞానికి మా పూర్తి మద్దతు తెలుపుతూ, అమరావతి అభివృద్ధి మరింత వేగంగా సాగాలని ఆకాంక్షిస్తున్నాము ఆయన అన్నారు.ప్రతి ఒక్కరు కలిసి పనిచేస్తే అమరావతి భవిష్యత్తు మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కూడా ప్రకాశవంతమవుతుంది తిరుపతి శ్రీనివాసరావు తెలిపారు.

Leave a Reply