3rdMayeditorial | బెంగాల్ పై దేశం దృష్టి
3rdMayeditorial | బెంగాల్‌పై దేశం దృష్టి
3rdMayeditorial | బీజేపీ ధీటైన సవాల్.. మమత పై పెరుగుతున్న ఒత్తిడి
కేంద్రం చర్యలపై అనుమానం.. ఎన్నికల ప్రక్రియ పై ఆందోళన
స్ట్రాంగ్ రూమ్ తనిఖీల్లో అసహజం.. రాజకీయంగా వివాదం
మమతపై ప్రత్యేక నిఘా? కేంద్ర వైఖరిపై విమర్శలు
బీజేపీ లక్ష్యం స్పష్టం.. మమతను ఓడించాలన్న పవర్ ప్లాన్
3rdMayeditorial | ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ సోమవారం జరగనున్నప్పటికీ, దేశం మొత్తం అందరి దృష్టి పశ్చిమ బెంగాల్‌పై కేంద్రీకృతమైంది. రాష్ట్రంలో మూడు సార్ల నుంచి గెలుస్తూ వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ ఈసారి ఓడిపోతుందని బీజేపీ నాయకులు ఢంకా భజాయించి మరీ చెబుతున్నారు. ప్రజల్లో అసంతృప్తి అన్ని చోట్లా మాదిరిగా అక్కడా ఉన్నప్పటికీ, బెంగాల్‌పైనే బీజేపీ తన దృష్టిని కేంద్రీకరించడానికి కారణం మమతా బెనర్జీని ఇంటికి పంపి తీరుతామన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా పదే పదే చేస్తున్న ప్రకటనలు అనుమానంను పుట్టిస్తున్నాయి. కేంద్ర హోం మంత్రిగా తనకున్న విశేషాధికారాలను ఉపయోగించి ఆయన ఇప్పటికే రాష్ట్రంపై అన్ని రకాల ఒత్తిడి తెచ్చారు. ఇప్పటికీ తెస్తున్నారు. పోలింగ్ సమయంలోనే కాకుండా, ఓట్ల లెక్కింపు సమయంలో కూడా కేంద్రం రాష్ట్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఉదాహరణకు, కేంద్ర ఎన్నికల సంఘం నియమించే అధికారులంతా కేంద్ర హోం శాఖ ఆదేశాల ప్రకారం నడుచుకుంటున్నారన్న ఆరోపణలు వచ్చాయి.
సాధారణంగా ఎన్నికల సమయంలో విధుల్లో ఉన్న వారంతా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు లోబడి పని చేయాల్సి ఉంటుంది. అయితే, కేంద్ర హోం శాఖకు ఉన్న విశేష అధికారాలను పురస్కరించుకుని ఆ శాఖ అధికారులు, మంత్రి జారీ చేసే ఆదేశాలను పాటించవలసిందే. కానీ, బెంగాల్లో పరిస్థితిలో అసహజ స్థితి కనిపిస్తోంది. ఎన్నికల తతంగం పూర్తయ్యే వరకు కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలోనే అన్ని కార్యకలాపాలు జరుగుతాయి. కానీ, ముఖ్యమంత్రి, తృణమూల్ అధ్యక్షురాలు మమతకు వ్యతిరేకంగా పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌లను తనిఖీ చేయడంలో కొంత అసహజత్వం కనిపించింది. అదేమిటంటే, మమత అక్కడ కొన్ని గంటల పాటు ఉన్నారంటూ ఫిర్యాదు చేశారు. నిజానికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మమత రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి అక్కడ తనిఖీ నిర్వహించారు. ఆమెకు ఉన్న అనుమానాలను నివృత్తి చేసుకున్నారు. బీజేపీ అభ్యర్థి సువేందు అధికారికి ప్రస్తుతం ఏ అధికారమూ లేదు.

ఆయనను స్ట్రాంగ్ రూమ్‌లలోకి అనుమతించడం కొంత అసహజంగానే కనిపిస్తోంది. అలాగే, కౌంటింగ్ సమయంలో సూక్ష్మ పరిశీలకులుగా కేంద్ర అధికారులనే నియమిస్తామంటూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించడాన్ని మమత సవాల్ చేశారు. ఆ అధికారం ఎన్నికల కమిషన్‌కే ఉందంటూ ఆమె అభ్యంతరాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. గట్టిగా ఒత్తిడి తెచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ అధికారులను కూడా అనుమతిస్తామని ప్రకటించింది. ఇదంతా చూస్తుంటే, కేంద్ర అధికారుల ఆధ్వర్యంలో కౌంటింగ్ జరిపించాలని కేంద్రం ప్లాన్ చేసినట్టుగా కనిపిస్తోంది.
మమత ప్రతి అడుగులోనూ నిఘా వేసి, ఆమెను ఒక అనుమానితురాలిగా కేంద్రం చూస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇందుకు బీజేపీ నాయకులు ఇచ్చే ఫిర్యాదులనే ప్రామాణికంగా తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. బెంగాల్లో ఇంతకుముందు వామపక్ష ఫ్రంట్ నాలుగు దఫాలు అధికారంలో కొనసాగింది. అప్పటి ముఖ్యమంత్రి జ్యోతిబసుపై ఇంతటి నిఘా వేయలేదు. ప్రతిపక్షంలో ఉన్నా, కేంద్రంతో సామరస్యంగా ఉన్న లేదా ఉన్న ముఖ్యమంత్రుల పట్ల ఒక విధంగానూ, పోరాట వైఖరిని అనుసరిస్తున్న మమత పట్ల మరో విధంగానూ కేంద్రం వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఎన్ని ప్రయత్నాలైనా చేసి మమతను ఓడించాలన్న బీజేపీ యత్నాలకు కేంద్రం దోహదం చేస్తోందేమోనన్న అనుమానం కలుగుతోంది.
