Medaram | 250 మంది చిరు వ్యాపారస్తులు

Medaram | 250 మంది చిరు వ్యాపారస్తులు

Medaram | తాడ్వాయి, ఆంధ్రప్రభ : మేడారంలో అభివృద్ధి పనులను తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు దుగ్గి చిరంజీవి(Duggi Chiranjeevi) సందర్శించారు. ఈ సందర్భంగా మేడారంలో ఉన్న చిరు వ్యాపారస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. మేడారం అభివృద్ధి పనులు అక్కడ ఉన్న చిరు వ్యాపారస్తులను రోడ్డున పడేశాయని ఆయన అన్నారు.

మేడారం(Medaram)లో రోడ్డు వెడల్పు అభివృద్ధి పేరుతో అక్కడ ఉన్న చిరు వ్యాపారస్తులు ఉపాధి కోల్పోతున్నారు. వారు పేదరికంతో ఉండి రోజువారి వ్యాపారంతో జీవనం కొనసాగిస్తున్నారు. ఇటువంటి పరిస్థితులలో రోడ్డు అభివృద్ధి పేరుతో వారిని అక్కడ నుండి దుకాణాలను పూర్తిగా కాళీ చేయిస్తున్నారు. ప్రభుత్వ(Govt) అధికారులు జీవన ఉపాధి లేకుండా చేస్తున్నార‌న్నారు.

మేడారం అభివృద్ధి వారికి శాపంలా మారిందని అక్కడ చిరు వ్యాపారస్తులు ఆందోళన చెందుతున్నార‌ని పేర్కొన్నారు. అభివృద్ధి జరిగితే అందరికీ ఉపయోగకరంగా ఉండాలి కానీ దాదాపుగా 250 మంది(250 people) చిరు వ్యాపారస్తులు నష్టపోతున్నార‌న్నారు. ఇప్పటివరకు వాళ్ల ఉపాధికి ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోలేదు కాబట్టి ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి ఎంతమంది వ్యాపారస్తులు ఉన్నారో సర్వే చేసి వారికి వేరొక ప్రాంతంలో షాపుల(shops)ను పెట్టుకోవడానికి స్థలాలు కేటాయించాలని, వారిని ఆర్థికంగా ఆదుకోవాలని లేకపోతే తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో నష్టపోయే చిరు వ్యాపారస్తులను సమీకరించి వారికి న్యాయం జరిగే వరకు ఆందోళన పోరాట కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Medaram

Leave a Reply